![Actor Madhavan Buys The Indian Roadmaster Cruiser](/styles/webp/s3/article_images/2017/10/23/bike.jpg.webp?itok=tI-RS2WI)
బహుభాషా నటుడు రంగనాథన్ మాధవన్ గ్యారేజ్‌లోని మరో వాహనం చేరింది. దీపావళి సందర్భంగా అతడు ఒక సరికొత్త లగ్జరీ క్రూజర్(బైక్) కొన్నాడు. అమెరికా కంపెనీ తయారు చేసిన ‘ఇండియన్ రోడ్‌మాస్టర్’ ను సొంతం చేసుకున్నాడు. తన గ్యారేజ్‌లోకి కొత్తగా చేరిన ఈ భారీ బైక్‌పై మాధవన్ చక్కర్లు కొట్టాడు. దీన్ని దక్కించుకోవడం తనకెంతో గర్వంగా ఉందని అతడు పేర్కొన్నాడు. తనెంతో ఇష్టపడి కొనుకున్న క్రూజర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అత్యాధునిక ఫీచర్లతో దర్పం ఉట్టిపడే దీని ధర దాదాపు రూ. 40.45 లక్షలు(ఎక్స్ షోరూమ్). బూడిద, నల్లుపు రంగులో మెరిసిపోతున్న ఈ టూవీలర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. 1811 సీసీ థండర్‌స్ట్రోక్ 111, వి-ట్విన్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్ బ్యాక్స్, 64.4 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోట్ ట్యాంక్‌తో పాటు 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం కూడా ఉంది. దీంట్లో మ్యూజిక్ వింటూ నావిగేషన్ చూసుకుంటూ జోరుగా సాగిపోవచ్చు. యూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైట్లు, క్రూజ్ కంట్రోల్, రిమోట్ లాకింగ్ వంటి సదుపాయాలు కూడా ‘ఇండియన్ రోడ్‌మాస్టర్’లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment