మాధవన్ తో సాయిపల్లవి రొమాన్స్ | Sai Pallavi romance with Madhavan | Sakshi
Sakshi News home page

మాధవన్ తో సాయిపల్లవి రొమాన్స్

Published Fri, Jan 20 2017 3:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

మాధవన్ తో సాయిపల్లవి రొమాన్స్

మాధవన్ తో సాయిపల్లవి రొమాన్స్

తమిళ తెరకు నటి సాయిపల్లవి కొత్త కావచ్చు కానీ, ఈ మలయాళీ భామ పేరు మాత్రం ఇక్కడా పాపులరే. మలయాళం చిత్రం ప్రేమమ్‌ చూసిన వారికి సాయిపల్లవి గురించి ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు.అందులో మలర్‌ టీచర్‌ పాత్రల్లో అంతగా ఇమిడిపోయి నటించారు. అయితే కోలీవుడ్‌కు మాత్రం ఈ అమ్మడు ఊరిస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఏస్‌ ఫిలింమ్‌ మేకర్‌ మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.ఆ తరువాత విక్రమ్‌తో రొమాన్స్ కు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది.అయితే అదీ ప్రచారానికే పరిమితమైంది. తాజాగా సాయిపల్లవి కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది.

అమ్మాయి మడ్డీ అని ముద్దుగా పిలుచుకునే నటుడు మాధవన్ కు జంటగా నటించడానికి ఈ బ్యూటీ సిద్ధం అవుతున్నారు. ఇరుదు చుట్రు చిత్రం తరువాత మాధవన్ ళ చిత్రం ఏదీ రాలేదు. ఒకటి రెండు చిత్రాలు కమిట్‌ అయిన మాధవన్  నటించనున్న తాజా చిత్రం ఇదే అవుతుంది.దీనికి విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాలను హ్యాండిల్‌ చేసే ఈయన దేవి చిత్రం తరువాత మలయాళ సక్సెస్‌ఫుల్‌ చిత్రం చార్లీని రీమేక్‌ రెడీ అయ్యారు.ఈ రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రంలో మాధవన్, సాయిపల్లవి రొమాన్స్ చేయనున్నారు. దీని గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రుతి నల్లప్ప తెలుపుతూ మలయాళ చిత్రం చార్లీని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు.

ఇందులో రొమాంటిక్‌ హీరో పాత్రకు మాధవన్  కరెక్ట్‌గా నప్పుతారని దర్శకుడు విజయ్, తాము కలిసి నిర్ణయించుకుని ఆయన్ని సంప్రందించామని చెప్పారు.మాధవన్ కూడా చిత్రం చూసి కచ్చితంగా నటిస్తానని అంగీకరించారని అన్నారు. ఇక సాయిపల్లవిని ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. లియోన్  జేమ్స్‌ సంగీతాన్ని, నిరవ్‌షా ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం షూటింగ్‌ మార్చిలో ప్రారంభం కానుంది.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement