
చెన్నై: ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ రజతం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల మాధవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. దేవుడి అనుగ్రహంతో భారత్‌కు తన కుమారుడు ఆసియా క్రీడల్లో రజత పతకం అందించడం సంతోషకరమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వేదాంత్ విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గొప్ప విజయాన్ని సాధించిన వేదాంత్, మాధవన్‌కు అభినంధనలు తెలియజేస్తున్నట్లు నటుడు రాహుల్‌రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. అద్భుత విజయంతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడంటూ పలువురు అభిమానులు వేదాంత్‌ను కొనియాడారు. ఇక బాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజీవ్‌కుంద్రా వేదాంత్‌ను రాక్‌స్టార్‌తో పోల్చడం విశేషం. కాగా మాధవన్ పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా వెబ్ సిరీస్‌లోను నటించాడు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాద్‌షా షారూఫ్‌ఖాన్ జీరో సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన మాధవన్.. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నంబీ నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్త పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలలో త్వరలోనే విడుదల కానుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment