కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తోన్న సూర్య కొన్ని నెలలుగా ముంబయిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్నారు. సూర్యకి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో చెన్నై వదిలిపెట్టి.. పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అయ్యారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా ముంబయిలో ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరైన సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడో తెలుసుకుందాం.
(ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?)
అభిమానుల మీట్‌లో సూర్య మాట్లాడుతూ..' తాను ముంబైలో ఉండడం లేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన కూతురు, కొడుకు చదువు కోసమే ఇక్కడ ఉంటున్నాం. తాను ఇప్పటికీ తమిళనాడులోనే ఉంటున్నానని నటుడు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జీవితంలో కొత్తది నేర్చుకోవాలనే తపనతో ఉన్నానని వెల్లడించారు. అందుకే తన సహచరుడు మాధవన్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాట్లు తెలిపారు. కాగా.. మాధవన్, సూర్య మంచి స్నేహితులు. కాగా.. జ్యోతికను 2006లో సూర్య వివాహం చేసుకున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ విక్రమ్‌లోని రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా ఒక సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తనను సంప్రదించారని సూర్య పేర్కొన్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!)
Comments
Please login to add a commentAdd a comment