వెండితెరలో శిఖరాగ్రాలను అందుకున్న హీరోయిన్ స్వీటీ అనుష్క. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషకాలు అందుకోగల అతి కొద్దిమంది టాలీవుడ్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించి 15 వసంతాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ అందచందాల్లోనూ, అభినయాల్లోనూ తనకు తానే సాటిగా నిలిచారు. అయితే ఆమెను కొన్ని సంవత్సరాలుగా ఓ విషయం వెంటాడి వేధిస్తోంది. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ అది అంతలా బాధిస్తోంది తనను కాదని, తన కుటుంబాన్ని అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆమె దేనికోసం మాట్లాడుతుందనుకుంటున్నారు.. ఇంకేముందీ పెళ్లిగోల... అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించదని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు జడ్జిమెంటల్ హై క్యా దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ వ్యాపారవేత్తతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలకూ కొదవ లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు వినీవినీ అనుష్కకు విసుగెత్తిపోయారు. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..)
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కుండ బద్ధలు కొట్టారు. ‘ప్రేమ విషయాన్ని ఎవరూ దాయలేరు, అలాంటిది నేనెలా దాస్తాననుకున్నారు’ అని తిరిగి ప్రశ్నించారు. ఇంత సెన్సిటివ్ మ్యాటర్‌ను రచ్చకీడుస్తారేంటని మండిపడ్డారు. ‘నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. అందులోకి ఎవరైనా తలదూర్చడం నాకు ఇష్టం ఉండదు. వివాహం అనేది జరగాల్సినప్పుడు జరుగుతుంది. అయినా ఈ వదంతులన్నీ ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇలాంటి అసత్య ప్రచారాలను అస్సలు పట్టించుకోనివారిలో నేనూ ఒకదాన్ని. కానీ ఈ రూమర్స్ వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వీటీ. ‘నా పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు విడిచిపెట్టాను. కాబట్టి నా వివాహం తప్పకుండా పెద్దలు కుదిర్చినదే అవుతుంది’ అని స్పష్టం చేశారు. (అనుష్క విషయంలో ఇదీ వదంతేనా?)
అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి: అనుష్క
Published Fri, Mar 13 2020 5:15 PM | Last Updated on Fri, Mar 13 2020 7:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment