రీమేక్‌తో వస్తున్నారా? | Shah Rukh Khan to turn 'Money Heist into a Bollywood film | Sakshi
Sakshi News home page

రీమేక్‌తో వస్తున్నారా?

Published Sun, Aug 4 2019 5:39 AM | Last Updated on Sun, Aug 4 2019 5:39 AM

Shah Rukh Khan to turn 'Money Heist into a Bollywood film  - Sakshi

‘డాన్‌ 3’, రాజ్‌కుమార్‌ హిరాణీతో ఓ లవ్‌ స్టోరీ, ఆదిత్య చోప్రాతో సినిమా, అట్లీతో ఓ రీమేక్‌ సినిమా... ఈ సినిమాల్లో షారుక్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనే విషయంలో క్లారిటీ రాలేదు. లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో వినిపిస్తున్న కొత్త న్యూస్‌ ఏంటంటే... స్పానిష్‌ సిరీస్‌ ‘మనీ హేస్ట్‌’ను హిందీలో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సిరీస్‌ రైట్స్‌ను కూడా షారుక్‌ తీసుకున్నట్టు తెలిసింది. ఈ సిరీస్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌గా రూపొందించే ఆలోచనలో ఆయన టీమ్‌ ఉందని సమాచారం. బ్యాంక్‌ దొంగతనం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాని షారుక్‌ నిర్మించడం మాత్రమేనా? నటిస్తారా? అనే విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత మిగతా వివరాలను ప్రకటించనున్నారు టీమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement