లాక్‌డౌన్‌లో సోనూ సూద్ రియల్ హీరో అయ్యారు. ఆ తర్వాత రీల్ హీరో కూడా అయ్యారు. హీరోగా పలు చిత్రాలు కమిటయ్యారు. ‘కిసాన్’ అనే సినిమాలో హీరోగా చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. తాజాగా తమిళ హిట్ చిత్రం ‘ఇరంబుదురై’ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట సోనూ సూద్. విశాల్ హీరోగా, అర్జున్ విలన్ పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులో ‘అభిమన్యుడు’గా విడుదలైంది. ఈ హిందీ రీమేక్‌కి సంబంధించిన మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విశాల్ విలన్‌గా కనిపించనున్నారట. ఈ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్‌కి ఎంట్రీ కాబోతున్నారు. సో.. విలన్ హీరో అయితే హీరో విలన్ అయ్యారు. రోల్స్ రివర్శ్ అయ్యాయన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment