బ్రేక్‌ తర్వాత... | Deepika Padukone And Rishi Kapoor to star in The Intern Hindi Remake | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ తర్వాత...

Published Fri, Mar 20 2020 12:22 AM | Last Updated on Fri, Mar 20 2020 4:23 AM

Deepika Padukone And Rishi Kapoor to star in The Intern Hindi Remake - Sakshi

దీపికా పదుకోన్‌

హాలీవుడ్‌ చిత్రం ‘ది ఇంటర్న్‌’ హిందీ రీమేక్‌లో దీపికా పదుకోన్‌  కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. రిషి కపూర్‌ ఓ ముఖ్య పాత్ర చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్టర్‌ చేస్తారనే విషయంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ‘బదాయి హో’ ఫేమ్‌ అమిత్‌శర్మ,,  ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’, ‘డియర్‌ జిందగీ’ చిత్రాలను తెరకెక్కించిన గౌరీ షిండేలతో ఈ చిత్రబృందం చర్చలు జరుపుతోందన్నది తాజా సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు డైరెక్టర్‌ సీట్‌లో కూర్చుంటారో చూడాలి. అయితే గౌరీ షిండేకే ఎక్కువ చా¯Œ ్స ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్‌ పడింది. ఈ బ్రేక్‌ తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement