
దీపికా పదుకోన్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా చేసిన ‘చప్పాక్’ తర్వాత దీపికా పదుకోన్ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి బాలీవుడ్‌లో ఉంది. ఫ్యాన్స్ ఎదురుచూపులకు సోమవారం ఫుల్‌స్టాప్ పెట్టారామె. తన తదుపరి చిత్రం ‘ద ఇంటర్న్’ అని ప్రకటించారు. 2015లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఇంటర్న్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ చిత్రంలో రోబర్ట్ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్ చేయనున్నారు. రిషీ కపూర్ కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే పాత్రలో దీపిక నటిస్తారట. ఈ సినిమాను హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో కలిసి దీపికా నిర్మించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దర్శకుడు ఎవరనేది తెలియాలి. ‘‘నా తదుపరి చిత్రం ‘ది ఇంటర్న్’ రీమేక్ అని ప్రకటించడానికి థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దీపికా.
Comments
Please login to add a commentAdd a comment