హిందీలో మణిరత్నం హిట్ | Bejoy Nambiar to remake Mani Ratnam's 'Agni Nachathir.. | Sakshi
Sakshi News home page

హిందీలో మణిరత్నం హిట్

Published Fri, Apr 22 2016 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

హిందీలో మణిరత్నం హిట్

హిందీలో మణిరత్నం హిట్

దిగ్దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన మేటి చిత్రాల్లో ‘అగ్ని నక్షత్రం’(తెలుగులో ‘ఘర్షణ’) ఒకటి.  కార్తీక్, ప్రభు ముఖ్యపాత్రల్లో 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది.  ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్ ముఖ్యపాత్రల్లో ‘వజీర్’ చిత్రాన్ని తెరకెక్కించిన బిజోయ్ నంబియార్ ఈ రీమేక్‌కు దర్శకుడు. గమ్మత్తేమిటంటే, మెగాఫోన్ పట్టక ముందు బిజోయ్ కొన్నాళ్లు మణిరత్నం వద్ద సహాయకునిగా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల ఈ సినిమా రీమేక్ హక్కులను మణిరత్నం నుంచి తీసుకున్న బిజోయ్ ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్‌ను హిందీ వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement