
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీలో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. పనోరమ స్టూడియోస్ ఇంటర్‌నేషన్ సంస్థ నిర్మాతలు కుమార్ పాఠక్, అభిషేక్ పాఠక్ ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ‘‘దృశ్యం 2’ మంచి హిట్ సాధించింది. ఇలాంటి కథలు మరింతమంది ప్రేక్షకులకు చేరాలనే ఉద్దేశంతో హిందీ రీమేక్ హక్కులను తీసుకున్నాం’’ అన్నారు కుమార్, అభిషేక్.
అయితే హిందీ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై సరైన స్పష్టత ఇవ్వలేదు నిర్మాతలు. ఇక మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో ‘దృశ్యం’ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ హీరోగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
చదవండి: హిట్ రిపీట్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment