Shivaleeka Oberoi Hints Wedding With Drishyam 2 Director Abhishek Pathak, Post Inside - Sakshi
Sakshi News home page

Abhishek Pathak: దృశ్యం 2 డైరెక్టర్‌ను పెళ్లాడనున్న బ్యూటీ.. పోస్ట్‌ అర్థమదేనా?

Published Wed, Feb 1 2023 6:40 PM | Last Updated on Wed, Feb 1 2023 7:58 PM

Shivaleeka Oberoi Hints wedding with Drishyam 2 Director Abhishek Pathak - Sakshi

బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి పెళ్లిపీటలెక్కగా ఓ వారం రోజుల్లో కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. తాజాగా ఓ బాలీవుడ్‌ డైరెక్టర్‌ కూడా పెళ్లిపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్‌ అభిషేక్‌ పాఠక్‌, కుదా హఫీజ్‌ హీరోయిన్‌ శివలేఖ ఒబెరాయ్‌ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట! ఇదే విషయాన్ని నటి హింటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. 'ఆకాశంలో అన్ని నక్షత్రాలుండగా, సముద్రం ఒడ్డున ఇన్ని నక్షత్ర చేపలుండగా అతడు మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా నావైపే చూస్తున్నాడు' అంటూ ఓ ఫోటో షేర్‌ చేసింది.

ఇందులో అభిషేక్‌ ముఖం కనిపించకుండా బ్లర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అభిషేక్‌ పాఠక్‌- శివలేఖ గోవాలో పెళ్లి చేసుకోనున్నారంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా శివలేఖ ఒబెరాయ్‌ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్‌ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్‌ పాఠక్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది.

చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement