
కరీనా కపూర్, ఆమిర్ ఖాన్
దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్–కరీనా కపూర్ జంటగా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా కరీనాను సంప్రదించారట.
కరీనా ఓకే చెబితే దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్–కరీనా జోడీ కట్టినట్లే. 2009లో వచ్చిన హిట్ మూవీ ‘త్రీ ఇడియట్స్’ తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. మరోవైపు ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన కరీనా ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’ (హిందీ మీడియం సీక్వెల్) సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే కరీనా ఓ టెలివిజన్ షోకు కమిటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment