విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం.
స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట.
ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు.
అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్‌పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్‌లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది.
ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment