గోదారి గట్టు మీద... | Sankranthiki Vasthunnam starts Song Shoot | Sakshi
Sakshi News home page

గోదారి గట్టు మీద...

Published Thu, Nov 28 2024 5:37 AM | Last Updated on Thu, Nov 28 2024 5:37 AM

Sankranthiki Vasthunnam starts Song Shoot

వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌ లొకేషన్స్‌లో జరుగుతోంది. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి కాంబినేషన్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 

కాగా ఈ సినిమాలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రమణ గోగుల పాడారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement