
‘ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్ ΄పొంగల్’ అంటూ హుషారుగా ఆడిపాడుతున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం విడుదల చేశారు.
‘హే గొబ్బీయల్లో గొబ్బీయల్లో... పండగొచ్చే గొబ్బీయల్లో.. ఎవ్రీ బడీ గొబ్బీయల్లో... సింగ్ దిస్ మెలోడీ గొబ్బీయల్లో... పెద్ద పండగండీ గొబ్బీయల్లో.. లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బీయల్లో కమాన్’.. ‘బేసికల్లీ.. టెక్నికల్లీ... లాజికల్లీ... ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ... ఇట్స్ ఏ యాటిట్యూడ్ ΄పొంగల్... ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్ ΄పొంగల్’... అంటూ ఈపాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటని వెంకటేశ్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియోపాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈపాటలో వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షీ చౌదరి సంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment