కన్ఫ్యూజన్ తీరింది.. వెంకటేష్ కూడా సంక్రాంతికే | Venkatesh Sankranthiki Vasthunam Movie Release Date With Poster, Check Interesting Insights | Sakshi
Sakshi News home page

Sankranthiki Vasthunam: సంక్రాంతి బరిలోనే వెంకీ.. చరణ్, బాలయ్యతో పోటీ

Published Fri, Nov 1 2024 11:28 AM | Last Updated on Fri, Nov 1 2024 12:12 PM

Venkatesh Sankranthiki Vasthunam Movie Release Date Details

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతోపాటు రిలీజ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

రాబోయే సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ఉంది. దీన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా ప్రొడ్యూస్ చేశారు. చరణ్ మూవీ వస్తున్నందున వెంకీ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని గత కొన్నిరోజులుగా రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు టైటిల్ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది.

ఇల్లాలు, ప్రియురాలు తరహా కాన్సెప్ట్‌తో వెంకీ కొత్త సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ మాజీ పోలీస్‌గా కనిపిస్తారు. అతడి భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ సంగీతమందించారు. సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు గానీ తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. మరి ఇప్పుడు చెప్పినట్లు పండక్కి వస్తారా? చివరి నిమిషంలో ఏమైనా వాయిదా అని చెప్పి షాకిస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement