
అనిల్ రావిపూడి, ఐశ్వర్యా రాజేశ్, వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ‘దిల్’ రాజు, శిరీష్, భీమ్స్
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ బాగా వచ్చింది. మీరంతా మీ ఫ్యామిలీతో థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాని ఎంజాయ్ చేయండి’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు (మంగళవారం) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా సినిమాలను నా ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అనిల్ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశాడు. మళ్లీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో నేను చేసిన మూడో ఫిల్మ్ ఇది. ఆడియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్‌లోనే బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది’’ అని తెలిపారు అనిల్ రావిపూడి.
‘‘వెంకటేశ్‌గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర లిమాయే, సింగర్ రమణ గోగుల, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, డీవోపీ సమీర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment