డబుల్‌ చాన్స్‌? | Trisha to star opposite Prabhas in Sandeep Reddy Vanga Spirit movie | Sakshi
Sakshi News home page

డబుల్‌ చాన్స్‌?

Published Wed, Aug 21 2024 3:29 AM | Last Updated on Wed, Aug 21 2024 3:29 AM

Trisha to star opposite Prabhas in Sandeep Reddy Vanga Spirit movie

హీరోయిన్‌ త్రిష ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, తమిళంలో కమల్‌హాసన్‌ ‘థగ్ లైఫ్‌’, అజిత్‌ ‘విడా ముయర్చి’, మలయాళంలో మోహన్‌లాల్‌ ‘రామ్‌’... ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా త్రిషకు మరో రెండు పెద్ద అవకాశాలు వచ్చాయనే టాక్‌ వినిపిస్తోంది. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’  (2007), ‘నమోః వెంకటేశాయ’ (2010), ‘బాడీగార్డ్‌’ (2012) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌తో కలిసి త్రిష మరోసారి నటించనున్నారట. 

నందు దర్శకత్వంలో వెంకటేశ్‌ ఓ సినిమా చేయనున్నారని, ఇందులోనే త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ‘వర్షం’ (2004), ‘΄ûర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) సినిమాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారట. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

 ఈ చిత్రంలోనే త్రిష హీరోయిన్‌గా నటిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవితో కలిసి త్రిష ‘విశ్వంభర’ చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘స్టాలిన్‌’ (2006) చేశారు. మరి.. పన్నెండేళ్ల తర్వాత వెంకటేశ్‌తో, పదహారేళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించే డబుల్‌ చాన్స్‌ త్రిషకు దక్కుతుందా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement