ప్రభాస్‌కు బెస్ట్‌ జోడీ.. 18 ఏళ్ల తర్వాత ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ | Prabhas And Trisha Again Movie Chance | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు బెస్ట్‌ జోడీ.. 18 ఏళ్ల తర్వాత ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ

Aug 6 2024 7:44 AM | Updated on Aug 6 2024 9:03 AM

Prabhas And Trisha Again Movie Chance

టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌-త్రిష జోడీ ప్రముఖంగా ఉంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో కనిపించి మెప్పించారు. అయితే, మరోసారి వీరిద్దరూ వెండితెరపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో త్రిష పేరు ట్రెండ్‌లో ఉంది. 40 ఏళ్లు దాటినా కూడా ఇప్పుడొస్తున్న హీరోయిన్లుకు ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో ఈ బ్యూటీ దూసుకుపోతుంది.

ప్రభాస్‌-త్రిష జోడీ వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఫిదా చేశారు. ముఖ్యంగా వర్షం సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేర్చింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘స్పిరిట్‌’ సినిమాలో కలిసి నటించేందుకు  సిద్ధమైనట్లు తెలుస్తోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న  ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష అయితే బాగుంటుందని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ అంశం గురించి ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరిగాయని టాక్‌. 

ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్  కూడా ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. సందీప్‌రెడ్డి వంగా నుంచి యానిమల్‌ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్‌ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా దాదాపు పూర్తయినట్లు ఇటీవల సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ ఒక బలమైన పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. 'రాజాసాబ్‌'తో బిజీగా ఉన్న ఆయన ఈ చిత్రం తర్వాత స్పిరిట్‌ పట్టాలెక్కనుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. మరోవైపు త్రిష కూడా సౌత్‌ ఇండియాలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. 'బృంద' వెబ్‌ సిరీస్‌తో ఆమె భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో కూడా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement