హీరో వెంకటేశ్, హీరోయిన్ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు తీసి, హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి.
ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్ 3’ క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజే తాజాగా వెంకీ–అనిల్ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment