ఫస్ట్‌ టైం యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశా : మీనాక్షి చౌదరి | Meenakshi Chaudhary Talks About Sankranthiki Vasthunnam Movie | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ టైం యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశా : మీనాక్షి చౌదరి

Published Fri, Jan 3 2025 4:02 PM | Last Updated on Fri, Jan 3 2025 4:06 PM

Meenakshi Chaudhary Talks About Sankranthiki Vasthunnam Movie

ఇంతవరకు నేను సీరియస్‌ రోల్‌తో పాటు గ్లామర్‌ పాత్రలు మాత్రమే చేశాను.కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్‌టైం  కామెడీ స్పేస్ లో కాప్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. నన్ను కాప్ రోల్ చూడటం ఆడియన్స్ కి కూడా ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ టైం ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు మీనాక్షి చౌదరి. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్స్‌గా నటించారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్ లా ఉంది. నన్ను నేను నిరూపించుకునే మంచి కథలు, పాత్రలు రావడం చాలా సంతోషంగా ఉంది.

కాప్‌ రోల్‌ చేయాలనే నా డ్రీమ్‌ ఈ సినిమాతో తీరింది.మా డాడీ ఆర్మీ ఆఫీసర్. ఆఫీసర్ బాడీ లాంజ్వెజ్ పై ఐడియా ఉంది. నేను కూడా కొంత హోం వర్క్ చేశాను.    

వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్ పీరియన్స్. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్ లో కూడా ఒక మంచి రేపో వుండేది. సీన్స్ అన్నీ ఫ్లోలో అద్భుతంగా జరిగాయి. వెంకటేష్ గారు చాలా ఫిట్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

ఐశ్వర్య రాజేష్ గారు ఎస్టాబ్లెస్ యాక్టర్. ఐశ్వర్య నటించిన చాలా సినిమాలు చూశాను. ఒక ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది, తను చాలా పాజిటివ్ గా వుంటారు. తనతో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

నేను యాక్ట్ చేసిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తర్వాత నా పేరు 'మీను' మీద వచ్చిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీయడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్ మెంట్ కోసం స్పాంటినియస్ గా ఆలోచించాలి. సీన్ బెటర్ చేయడంలో అనిల్ గారి ఆలోచనలు చాలా అద్భుతంగా వుంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైం. ఆయన చాలా ఓపికగా ప్రతిది డిటేయిల్ గా ఎక్స్ ప్లేయిన్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.  
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా వండర్ ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement