స్టయిలిష్‌గా... | Sankranthiki Vasthunnam poster release | Sakshi
Sakshi News home page

స్టయిలిష్‌గా...

Published Fri, Dec 13 2024 6:20 AM | Last Updated on Fri, Dec 13 2024 6:20 AM

Sankranthiki Vasthunnam poster release

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌  నటించారు. వెంకటేశ్‌ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్‌ కానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement