'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో పోటోలు దిగారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విజయం కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. తాజాగా వెంకటేశ్ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వినూత్నమైన ముక్కోణపు క్రైమ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో పోటీ పడి వాటికి మించిన ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది.
Comments
Please login to add a commentAdd a comment