Actress Laila joins the sets of Arivazhagan's Sabdham - Sakshi

Actress Laila: ఆది పినిశెట్టి చిత్రంలో నటి లైలా కీలక పాత్ర!

Mar 11 2023 9:37 AM | Updated on Mar 11 2023 11:11 AM

Actress Laila Plays Key Role in Aadhi Pinisetty and Arivalagan Movie - Sakshi

వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఈరం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆది పినిశెట్టికి జంటగా లక్ష్మీమీనన్‌ నటిస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత లక్ష్మీమీనన్‌ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్రంతో దర్శకుడు అరివళగన్‌ నిర్మాతగాను మారడం మరో విశేషం.

చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి

ఆయన ఆల్ఫా ఫ్రేమ్స్‌ సంస్థ 7జీ ఫిలింస్‌ శివతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాజాగా నటి లైలా చేరారు. ఇంతకుముందు తెలుగు, తమిళ భాషల్లో కథానాయక నటించిన ఆ తర్వాత పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటిది చాలా గ్యాప్‌ తర్వాత వదంతి అనే వెబ్‌ సీరీస్‌లో మెరిసిన లైలా ఇటీవల కార్తీ కథానాయక నటించిన సర్దార్‌ చిత్రంలో ముఖ్యపాత్రలో మళ్లీ వెండితెరపై కనిపించారు. తాజాగా ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు.

చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్‌-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!

ఈ విషయాన్ని చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని వారు చెప్పారు. ఇంతకుముందు కామెడీ హర్రర్‌ జానర్లో పలు చిత్రాలు వచ్చిన వాటికి పూర్తి భిన్నంగా ఈ చిత్రం హర్రర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు తెలిపారు. దీనికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌ పోస్టర్, టీజర్‌ విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement