న్యూఢిల్లీ:టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతని మరదలు ఆకాంక్ష శర్మ గృహహింస కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలను యువీ తరపు న్యాయవాది దమన్ బిర్ సింగ్ సోబ్తి ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. యువీపై ఆకాంక్ష ఎటువంటి కేసును పెట్టలేదని తాజాగా స్పష్టం చేశారు. దానిలో భాగంగానే అక్టోబర్ 21వ తేదీన యువరాజ్ కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరుకావాలంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదన్నారు. ఏ రకంగా చూసినా ఆకాంక్షను యువీ ఎప్పుడూ వేధించలేదని వివరణ ఇచ్చారు. నిన్న వెలుగుచూసిన వార్తలు కాలక్షేమం కోసం ఎవరో కావాలని చేసినవంటూ న్యాయవాది కొట్టిపారేశారు. జోరవర్-ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, మరి అటువంటప్పుడు మళ్లీ గృహహింస కేసు వార్తలు రావడం అర్థరహితమన్నారు.
చాల రోజుల నుంచి ఆకాంక్ష జరోవర్‌లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యువరాజ్ తల్లి షబ్నం కూడా కేసు వేసింది. ఇదిలా ఉంచితే, బిడ్డ కావాలంటూ బిడ్డ కావాలంటూ జరోవర్, షబ్నం ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ విషయంలో వారికి యువీ వత్తాసు పలుకుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే యువీపై గృహహింస కేసు నమోదైనట్లు మీడియాలో వెలుగుచూసింది.
Comments
Please login to add a commentAdd a comment