ఢిల్లీ: గృహ హింస కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చాలా పెద్ద ఊరట లభించిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం సోదరుడు జోరావర్ భార్య ఆకాంక్ష శర్మ.. యువరాజ్‌తో పాటు అతని కుటుంబంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే యువరాజ్‌పై పెట్టిన కేసులో ఎటువంటి వాస్తవం లేదని, లబ్ధి కోసమే అలా కేసు పెట్టినట్లు ఆకాంక్ష తెలిపినట్లు యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాంతో ఇక నుంచి యువరాజ్ ప్రశాంతంగా ఉండగలడని వారు తెలిపారు.
ఇటీవల జోరావర్-ఆకాంక్ష సింగ్‌లు కోర్టు ద్వారా విడాకులు పొందిన సంగతి తెలిసిందే. అయితే 2017లో భర్తతో పాటు యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నామ్ సింగ్‌లపై ఆకాంక్ష గృహ హింస కేసు పెట్టారు. చట్టం నుంచి తప్పించుకోలేని సందర్భంలో యువరాజ్‌పై పెట్టిన కేసును ఆకాంక్ష ఉపసంహరించుకున్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘కోట్లాది అభిమానులున్న యువీ పేరును అడ్డం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేశారు. గృహ హింస పేరుతో యువీ ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూశారు. చట్టంపై నమ్మకంతో యువీ పోరాడాడు. యువీకి చివరి ఊరట లభించింది మేము యువీని చూసి గర్విస్తున్నాం’ అని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment