
‘చంద్రముఖి’ సినిమా అనగానే జ్యోతిక.. జేజెమ్మ అంటే అనుష్క గుర్తుకురాక మానరు. ‘చంద్రముఖి’ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక ఏ రేంజ్‌లో అలరించారో తెలిసిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నాగవల్లి’ సినిమాలో జ్యోతిక పాత్రలో నాగవల్లిగా అలరించారు అనుష్క. తాజాగా మరోసారి జ్యోతిక పాత్రలో అనుష్క నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. జ్యోతిక ప్రధాన పాత్రలో జీవీ ప్రకాష్ హీరోగా బాలా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘నాచియార్’. పోలీసు అధికారిణిగా జ్యోతిక పలికిన డైలాగ్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. తెలుగు హక్కులను నిర్మాత కల్పన కోనేరు సొంతం చేసుకున్నారట. జ్యోతిక పాత్రకి స్వీటీ అయితేనే న్యాయం చేయగలరనీ, అప్పుడే తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా వస్తుందని అనుష్కతో చర్చలు జరిపారట. మరి అనుష్క గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? లేదా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment