నేను బతికే ఉన్నా : స్టార్ డైరెక్టర్‌ | Pvasu clarification on his health rumors | Sakshi
Sakshi News home page

Jan 16 2018 4:45 PM | Updated on Jan 16 2018 4:56 PM

Pvasu clarification on his health rumors - Sakshi

సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఆకతాయిలు పెట్టే పోస్ట్ లు ఒకోసారి వైరల్‌ అవ్వటం మూలంగా సెలబ్రిటీలకు ఇబ‍్బందులు తప్పటం లేదు. చంద్రముఖి సినిమాతో దక్షిణాది ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు పి. వాసు చనిపోయారంటూ గళవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై పి వాసు క్లారిటీ ఇచ్చారు.

‘ఈ రోజు ఉదయం ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేసి ఇంటికి వచ్చే సరికి నేను చనిపోయానంటూ వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసింది. వాట్సప్‌లోనూ చాలా మెసేజ్‌ లు వచ్చాయి. ఆ వార్తలు విని నాకు నవ్వొచ్చింది. నేను ఆరోగ్యం గా ఉన్న.. నా మీద ఇంతటి అభిమానం చూపిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పి. వాసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement