death rumours
-
నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతిచెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని, అయితే పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. నిన్న సాయంత్రం కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి అంటూ అని గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. అయితే అప్పటికే మీడియాలో, వెబ్సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. ఈ క్రమంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో ఆయన కనిపించారు. Prayers for Vikram Gokhale who has slipped into a Coma and is still very very critical according to his wife 🙏 #VikramGokhale — Sᴜᴢᴀɴɴᴇ Bᴇʀɴᴇʀᴛ (@suzannebernert) November 24, 2022 -
'సాంపుల్ మాత్రమే.. అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా'
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై రూమర్స్ పెరిగిపోయాయి. సినిమా హీరో నుంచి క్రికెటర్ల వరకు చూసుకుంటే.. ఫలానా వారితో రిలేషిన్షిప్.. లవ్‌ట్రాక్.. ఇంకా ఎన్నెన్నో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి బతికున్న మనిషిని చంపేయడం సోషల్ మీడియాలో బాగా అలవాటైపోయింది. సోషల్ మీడియా ఉన్నంతవరకు ఇలాంటి ఫేక్‌న్యూస్ గోల తప్పదు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఇలాంటి అనుభవమే ఎదురైందట. తాను చనిపోయినట్లు వచ్చిన వార్త చదువుకొని నవ్వాలో.. ఏడ్వాలో తెలియక అయోమయంలో ఉండిపోయినట్లు జడేజా పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఆసియాకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా పాకిస్తాన్‌పై విజయంతో జోష్‌లో ఉంది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో బుధవారం(ఆగస్టు 31న) తలపడనుంది. మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో జడేజా ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ''ఒక సందర్భంలో టి20 ప్రపంచకప్‌కు మీకు జట్టులో చోటు ఉంటుందా అని ప్రశ్న వేశారు. అది నాకు పెద్దగా వింతగా అనిపించలేదు. ఎందుకంటే అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా. అందులో నా చావు వార్త ఒకటి. ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ.. నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త చదవిన తర్వాత నాకు నవ్వు ఆగలేదు. అయినా ఇలాంటి పనికిమాలినవి పట్టించుకునే టైం లేదు. ఎప్పుడు నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కేవలం ప్రాక్టీస్ బాగా చేయాలి. సక్సెస్ అదే వెతుక్కుంటూ వస్తుంది. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా ఆసియాకప్ కొట్టబోతున్నాం.''అంటూ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 29 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేనప్పటికి బ్యాటింగ్‌లో రాణించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా Virat Kohli: హాంకాంగ్‌తో మ్యాచ్.. జిమ్‌లో కష్టపడుతున్న కోహ్లి -
'నేను యాక్సిడెంట్లో చనిపోయానన్నారు.. అది విని మా అమ్మ'
Actor Fardeen Khan Reacts To Fake News On His Death: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫేక్ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. పెళ్లి, ప్రేమాయణం, బ్రేకప్ వంటి పుకార్లతో సెలబ్రిటీలు చిరాకు పడిపోతుంటారు. అవి వారి సినీ కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందిపెడుతుంటాయని బాధ వెళ్లబోసుకున్న తారలు ఉన్నారు. ఇలాంటి సంఘటన ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్‌కు ఒకటి కాదు రెండు సందర్భాల్లో జరిగిందట. తాను కొన్నేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని, అప్పుడు ఓ యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఇప్పటికీ రెండు సార్లు రూమర్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుకార్లతో ఎంతో కలత చెందానని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటి ?' అని అడిగిన ప్రశ్నకు ఫర్దీన్ ఖాన్ ఈ విషయం చెప్పుకొచ్చారు. 'నేను కొంతకాలం హిందీ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో నేను ఒక యాక్సిడెంట్లో చనిపోయానని రెండుసార్లు వార్తలు వచ్చాయి. అది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే ఈ వార్త విని మా అమ్మకు గుండెపోటు వస్తే. లేదా ఇది చూసి నా భార్య ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేను. అందుకే నేను చనిపోయానన్న వార్త విన్నా, చదివినా నాకు బాధ, చిరాకు తెగ వచ్చేవి. ఇంత బాధ్యాతరాహిత్యంగా ఎలా ఉంటారని అనిపించేది.' అని ఫర్దీన్ ఖాన్ తెలిపారు. ఆయన 2010లో సుస్మితా సేన్‌తో కలిసి నటించిన 'దుల్హా మిల్గయా' సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు తాజాగా రితేష్ దేశ్ముఖ్తో కలిసి 'విస్ఫోట్' అనే సినిమాలో అలరించనున్నారు. వీరిద్దరూ 'హే బేబీ' సినిమాలో చివరిగా కలిసి నటించారు. ఇప్పుడు సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Nisha Dahiya Refuses Her Death Reports.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, జాతీయ స్థాయి మహిళ రెజ్లర్.. నిషా దహియా చనిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. హర్యానాలోని సోనిపట్‌లోని సుశీల్ కుమార్ అకాడమీలో జరిగిన కాల్పుల్లో నిషా దహియా, అతని సోదరుడుడ చనిపోయిందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నిషా దహియా స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించింది. '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్ న్యూస్.. ఆ వార్త నమ్మకండి'' అంటూ కామెంట్ చేసింది. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
-
Taliban: అజ్ఞాతం వీడిన తాలిబన్ చీఫ్, 10 నిమిషాల ఆడియో?
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అఖుంద్జాదా అజ్ఞాతం వీడకపోవడంతో అతను మరణించాడని వదంతులు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ తమ నేత కాందహార్‌లోని జామై దరూల్ అలూమ్ హకీమియా మదర్సాను సందర్శించినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే అఖుంద్జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అఖుంద్జాదా మతపరమైన బోధనలు మాత్రమే చేస్తున్నాడు. అయితే తాలిబన్ నాయకత్వానికి అల్లా దీవెనలు ఉండాలని చెబుతున్నాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన పోరాటంలో మరణించిన తాలిబన్ల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశాడు. 2016 అమెరికా డ్రోన్ దాడుల్లో అప్పటి తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ హతం అయ్యాక అఖుంద్జాదా తాలిబన్లకు చీఫ్ అయ్యాడు. (చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు) -
నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు
కాబూల్: తాలిబన్ల మధ్య అంతర్గతంగా జరిగిన ఘర్షణలో తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధానమంత్రి అబ్దుల్ ఘనీ బరాదర్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ల అధికారిక వెబ్సైట్లలో ఈ ఆడియోను పోస్టు చేశారు. తనకు ఏమీ కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం దారుణమని విమర్శించారు. పుకార్లు సృష్టించడం మానుకోవా లని హితవు పలికారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అధికారాన్ని పంచుకొనే విషయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన లో బరాదర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. -
ఆ వార్తలను నమ్మొద్దు.. వీడియో రిలీజ్ చేసిన షకీలా
చెన్నై: తన గురించి ప్రసారం అవుతున్న వదంతులను నమ్మొద్దని సంచలన నటి షకీలా పేర్కొన్నారు. శృంగార తార షకీలా ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. షకీలా మరణించారన్నదే ఆ వార్త. ఈ ప్రచారంతో షకీలా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. ఈమె మిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తను దత్తపుత్రికతో తీసుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. మిలా లేకపోతే తాను లేను తనకు జీవితమే లేదు తనకు తోడు మిలానే అని షకీలా పేర్కొన్నారు. దత్తపుత్రికతో షకీల (పైల్) Actress #Shakeela dismisses rumors about her and her health.. She is doing absolutely fine..@Royalreporter1 pic.twitter.com/ut41SrRGG4 — Ramesh Bala (@rameshlaus) July 29, 2021 -
నేను చనిపోలేదు.. ఎక్కువ సేపు నిద్రపోయానంతే: నటుడు
తను మరణించినట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత నిచ్చారు. కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్ పోస్టు షేర్ చేశాడు. అది చూసిన రావల్ స్పందిస్తూ తన మరణ వార్తపై చమత్కరించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాకా కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. దీంతో నెటిజన్లు శతమానం భవతి అంటూ ఆయనను ఆశీర్వదిస్తుంటే మరికొందరు ఇలా తప్పుగా ట్వీట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ మండిపడుతున్నారు. కాగా పరేశ్ రావల్ తెలుగులో చిరంజీవి హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో లింగం మామ పాత్రతో గుర్తింపు పొందారు. దీనితో పాటు ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కరోనా సెకండ్ వేవ్ భారత సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు బతికున్న నటులు సైతం కరోనాతో మరణించారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సింగర్ లక్కీ ఆలీ, నటుడు ముఖేష్ కన్నాలు కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వార్తలను వారు ఖండిస్తూ తాము చనిపోలేదని, బ్రతికే ఉన్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. మేం బతికిఉన్నామంటూ మేమే ప్రకటించుకోవాల్సి రావడం దురదృష్టకరమంటూ ముఖేష్ కన్నా వ్యాఖ్యానించినప్పటికి, తాజాగా పరేశ్ రావల్‌పై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం గమనార్హం. 🙏...Sorry for the misunderstanding as I slept past 7am ...! pic.twitter.com/3m7j8J54NF — Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021 -
నేను ఆరోగ్యంగా ఉన్నాను
-
నేను బతికే ఉన్నా : స్టార్ డైరెక్టర్
సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఆకతాయిలు పెట్టే పోస్ట్ లు ఒకోసారి వైరల్ అవ్వటం మూలంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పటం లేదు. చంద్రముఖి సినిమాతో దక్షిణాది ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు పి. వాసు చనిపోయారంటూ గళవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై పి వాసు క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రోజు ఉదయం ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేసి ఇంటికి వచ్చే సరికి నేను చనిపోయానంటూ వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసింది. వాట్సప్‌లోనూ చాలా మెసేజ్ లు వచ్చాయి. ఆ వార్తలు విని నాకు నవ్వొచ్చింది. నేను ఆరోగ్యం గా ఉన్న.. నా మీద ఇంతటి అభిమానం చూపిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పి. వాసు. -
డెత్ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి
ముంబై: తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వదంతులు చెలరేగడంతో ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి స్పందించారు. తాను చనిపోలేదంటూ ట్వీట్ చేసి ఈ వదంతులకు ఫుల్స్టాప్ పెట్టారు. 'నేను 'రిప్‌మోడ్' (రెస్ట్ ఇన్ పీస్ మోడ్.. ఆత్మకు శాంతి పొందే స్థితి)లో ఉన్నట్టు వదంతులను ప్రచారం చేస్తున్నారు. నేను బతికే ఉన్నాను. దయ చేసి ఇలాంటి వదంతులతో నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించకండి' అంటూ ఆమె ట్వీట్ చేశారు. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్ అయ్యారు. ఆమె తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్' హిట్ కావడం ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అనంతరం డ్యాన్స్ షో 'నాచ్ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచారు. గత ఏడాది టీవీ సహనటుడు వివేక్ దహియా పెళ్లాడిన ఆమె.. త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. -
నేను చనిపోలేదు, బతికేఉన్నా: ప్రముఖ నటి
దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి పలు ఫేమస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటి ఫరీదా జలాల్ మరణించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తాను బతికే ఉన్నానని స్పష్టంచేశారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నట్టు ఫరీదా జలాల్ పేర్కొన్నారు. తను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై ఆమె మండిపడ్డారు. 67 ఏళ్ల ఫరీదా జలాల్ చనిపోయినట్టు, ఆమె మృతికి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్టు కూడా ట్విట్టర్లో నివాళి ట్వీట్లు వెల్లువెత్తాయి. ఆమె వికీపీడియా పేజీలో కూడా ఫరీదా చనిపోయినట్టు అప్డేట్ చేశారు. ఫరీదా జలాల్ మృతిపై వస్తున్న రూమర్లపై డీఎన్ఏ ఆమెతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, నిరాధారంగా ఆ రూమర్లు ఎలా వస్తున్నాయో తనకు తెలియదని జవాబిచ్చారు. '' ఆ వార్తలను విన్న తొలుత నాకు చాలా నవ్వొచ్చింది. కానీ చివరి 30 నిమిషాల్లో నా ఫోన్ మోగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఆ సమయంలో కొంత అసహనం కలిగింది. అసలు ఎందుకు ఈ రూమర్లు సృష్టిస్తారా? అని కోపమొచ్చింది'' అని ఫరీదా జలాల్ పేర్కొన్నారు. అంతకముందు కూడా ఐశ్వర్యరాయ్ బచ్చన్, లతా మంగేస్కర్, దిలీప్ కుమార్ చనిపోయినట్టు ఇలానే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. I am here to confirm you that i am https://t.co/ua2kJyQ1Je of my death is nothing more than a rumour.Stop spreading fake & false news. — Farida Jalal (@FaridaJalal__) February 19, 2017 -
బతికుండగానే ఆ దర్శక దిగ్గజాన్ని చంపేశారు!
ప్రముఖులు చనిపోయారంటూ వందతులు వ్యాప్తి చేయడం ట్విట్టర్లో సర్వసాధారణంగా మారింది. మొన్నటికి మొన్న ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్, తమిళ హాస్యనటుడు సెంథిల్ (గౌడమణి) కూడా బతికుండానే చనిపోయినట్టు దుర్మార్గంగా ప్రచారం చేశారు. తాజాగా విఖ్యాత దర్శకుడు, వయోవృద్ధుడు మృణాల్‌సేన్ బతికుండానే చనిపోయారంటూ ట్విట్టర్లో వదంతులు షికారు చేశాయి. ఈ వదంతులు ఏ స్థాయికి వ్యాపించాయంటే బెంగాల్ సినీ ప్రముఖులైన అమితావ్ ఘోష్, కేతన్ సేథ్ వంటి పలువురు ఆయన మృతికి సంతాపం కూడా తెలిపారు. చిన్నాచితక వెబ్సైట్లలో ఆయన సేవలపై సంస్మరణ కథనాలు వెలువడ్డాయి. దీంతో కలత చెందిన మృణాల్ సేన్ కుటుంబం ఆదివారం వివరణ ఇచ్చింది. 93 ఏళ్ల మృణాల్ సేన్ నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఈ ఉదయం ‘చాయ్’ కూడా తాగారని, ఆయనకు ఏమీ కాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మృతిపై వస్తున్న కథనాలను వెంటనే ఆపేయాలని కోరింది. ట్విట్టర్లో వందతులు చూసి వెంటనే సంతాపాలు తెలిపిన ప్రముఖులు, నెటిజన్లు కూడా ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. ట్విట్టర్లో, ఆన్లైన్లో వెల్లువెత్తే వందతుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇది చాటుతోందని నిపుణులు చెప్తున్నారు. సమాంతర సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శక త్రయంలో మృణాల్ సేన్ ఒకరు. తన సమాకాలీనులైన సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటాక్లకు దీటుగా సినిమాలు తెరకెక్కించిన ఆయన దర్శక దిగ్గజంగా పేరు పొందారు. భువన్ షోమ్, ఖర్జీ, మృగయ వంటి సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. -
నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా: కమెడియన్
'ఏయ్ అల్లుడి చెప్పింది చేయ్' అంటూ 'అరుణాచలం' సినిమాలో రజనీకాంత్ వెంట ఉంటూ నవ్వులు పంచిన తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఇంటర్నెట్ లో దావానలంలా పాకింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. తాను చనిపోయినట్టు వార్తలు గుప్పుమనడంతో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు. 'నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోకండి' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. 'జెంటిల్మన్', 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆయన విశేషంగా నవ్వించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఇక, ఈ మధ్యకాలంలో సీనియర్ నటులు చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వదంతులు పుట్టడం తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటిమొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తదితరులు చనిపోయినట్టు వదంతులు గుప్పుమన్నాయి. -
మరో నటుణ్ని చంపేసిన సోషల్ మీడియా
ముంబై: హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగర్ నుంచి మొదలుపెడితే బాలీవుడ్ యువ సంచలనం ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ నటుల్లో ఎమ్మెస్ నారాయణ.. ఇలా ప్రాణాలు పోకముందే సోషల్ మీడియాలో చనిపోయిన నటుల జాబితా పెద్దదే. ఇప్పుడు వంతు బాలీవుడ్ వెటరన్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ ది. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం కిందటే సినిమాలకు దూరంగా ఉంటోన్న ఖాదర్ ఖాన్ చనిపోయారంటూ వేల సంఖ్యలో సందేశాలు సోషల్ మీడియాలో బట్వాడా అయ్యాయి. పలువురు అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారేగానీ అసలావార్త నిజమాకాదా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు చూసి కంగారుపడి, ఖాదర్ ఖాన్ కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం కనుక్కున్న తర్వాత మీడియాకు అసలు విషయం చెప్పారు దర్శకురాలు ఫౌజీ ఆర్షీ. 'ఖాదర్ ఖాన్ అనారోగ్యంగా ఉన్న సంగతి నిజమేకానీ, చనిపోవటం మాత్రం అవాస్తవం. కొద్దిసేపటి కిందటే ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఇలా బతికున్నవాళ్లను చనిపోయారంటూ పుకార్లు సృష్టించడం ద్వారా వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించారా?' అని ఆవేదన వ్యక్తం చేశారు ఫౌజీ. ఆమె దర్శకత్వం వహించిన 'హోగయా దిమాంగ్ కా దహి' సినిమాయే ఖాదర్ ఖాన్ ఇటీవల నటించిన చిత్రం. 78 ఏళ్ల ఖాదర్ నడవటం, మాట్లాడటంలో ఇబ్బందులు పడుతూ ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. -
మనోరమ క్షేమం
సీనియర్ నటి మనోరమ కన్ను మూసినట్టు ఆదివారం కొన్ని షోషల్ నెట్ వర్క్స్‌లో ప్రచారం సాగింది. దీంతో సినీ వర్గాలు, మనోరమ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అవన్నీ అసత్య ప్రచారంగా తేలింది. వెయ్యి చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నటించి చరిత్రకెక్కిన మనోరమ లాంటి వారిపై ఇలాంటి వదంతులు ప్రచారం కావడం బాధాకరంగా సినీ వర్గాలుపేర్కొంటున్నాయి. మనోరమ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, అసత్య ప్రచారాన్ని దయ చేసి చేయ వద్దని విన్నవించారు. గత కొంత కాలంగా మనోరమ అనారోగ్యం బారిన పడటం, ఆస్పత్రిలో చేరడం మళ్లీ డిశ్చార్జ్ కావడం తెలిసిందే.