మనోరమ క్షేమం | Death Rumours : Senior actress Manorama says I'm healthy | Sakshi
Sakshi News home page

మనోరమ క్షేమం

Published Tue, Feb 17 2015 1:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

మనోరమ క్షేమం - Sakshi

మనోరమ క్షేమం

 సీనియర్ నటి మనోరమ కన్ను మూసినట్టు ఆదివారం కొన్ని షోషల్ నెట్ వర్క్స్‌లో ప్రచారం సాగింది. దీంతో సినీ వర్గాలు, మనోరమ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అవన్నీ అసత్య ప్రచారంగా తేలింది. వెయ్యి చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నటించి చరిత్రకెక్కిన మనోరమ లాంటి వారిపై ఇలాంటి వదంతులు ప్రచారం కావడం బాధాకరంగా సినీ వర్గాలుపేర్కొంటున్నాయి. మనోరమ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, అసత్య ప్రచారాన్ని దయ చేసి చేయ వద్దని విన్నవించారు. గత కొంత కాలంగా మనోరమ అనారోగ్యం బారిన పడటం, ఆస్పత్రిలో చేరడం మళ్లీ     డిశ్చార్జ్ కావడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement