నేను చనిపోలేదు, బతికేఉన్నా: ప్రముఖ నటి | Farida Jalal confirms she is healthy as fake news of death spreads on social media | Sakshi
Sakshi News home page

నేను చనిపోలేదు, బతికేఉన్నా: ప్రముఖ నటి

Published Mon, Feb 20 2017 12:58 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

నేను చనిపోలేదు, బతికేఉన్నా: ప్రముఖ నటి - Sakshi

నేను చనిపోలేదు, బతికేఉన్నా: ప్రముఖ నటి

దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి పలు ఫేమస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటి ఫరీదా జలాల్ మరణించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తాను బతికే ఉన్నానని స్పష్టంచేశారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నట్టు ఫరీదా జలాల్ పేర్కొన్నారు. తను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై ఆమె మండిపడ్డారు. 67 ఏళ్ల ఫరీదా జలాల్ చనిపోయినట్టు, ఆమె మృతికి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్టు కూడా ట్విట్టర్లో నివాళి ట్వీట్లు వెల్లువెత్తాయి. ఆమె వికీపీడియా పేజీలో కూడా ఫరీదా చనిపోయినట్టు అప్డేట్ చేశారు.
 
ఫరీదా జలాల్ మృతిపై వస్తున్న రూమర్లపై డీఎన్ఏ ఆమెతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తాను  చాలా ఆరోగ్యంగా ఉన్నానని, నిరాధారంగా ఆ రూమర్లు ఎలా వస్తున్నాయో తనకు తెలియదని జవాబిచ్చారు. '' ఆ వార్తలను విన్న తొలుత నాకు చాలా నవ్వొచ్చింది. కానీ చివరి 30 నిమిషాల్లో నా ఫోన్ మోగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఆ సమయంలో కొంత అసహనం కలిగింది. అసలు ఎందుకు ఈ రూమర్లు సృష్టిస్తారా? అని కోపమొచ్చింది'' అని ఫరీదా జలాల్ పేర్కొన్నారు. అంతకముందు కూడా ఐశ్వర్యరాయ్ బచ్చన్, లతా మంగేస్కర్, దిలీప్ కుమార్ చనిపోయినట్టు ఇలానే  వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.   
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement