Photo Credit: ICC
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై రూమర్స్ పెరిగిపోయాయి. సినిమా హీరో నుంచి క్రికెటర్ల వరకు చూసుకుంటే.. ఫలానా వారితో రిలేషిన్‌షిప్.. లవ్‌ట్రాక్.. ఇంకా ఎన్నెన్నో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి బతికున్న మనిషిని చంపేయడం సోషల్ మీడియాలో బాగా అలవాటైపోయింది. సోషల్ మీడియా ఉన్నంతవరకు ఇలాంటి ఫేక్‌న్యూస్ గోల తప్పదు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఇలాంటి అనుభవమే ఎదురైందట. తాను చనిపోయినట్లు వచ్చిన వార్త చదువుకొని నవ్వాలో.. ఏడ్వాలో తెలియక అయోమయంలో ఉండిపోయినట్లు జడేజా పేర్కొన్నాడు.
కాగా ప్రస్తుతం ఆసియాకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా పాకిస్తాన్‌పై విజయంతో జోష్‌లో ఉంది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో బుధవారం(ఆగస్టు 31న) తలపడనుంది. మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో జడేజా ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ''ఒక సందర్భంలో టి20 ప్రపంచకప్‌కు మీకు జట్టులో చోటు ఉంటుందా అని ప్రశ్న వేశారు. అది నాకు పెద్దగా వింతగా అనిపించలేదు. ఎందుకంటే అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా. అందులో నా చావు వార్త ఒకటి. ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ.. నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
ఆ వార్త చదవిన తర్వాత నాకు నవ్వు ఆగలేదు. అయినా ఇలాంటి పనికిమాలినవి పట్టించుకునే టైం లేదు. ఎప్పుడు నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కేవలం ప్రాక్టీస్ బాగా చేయాలి. సక్సెస్ అదే వెతుక్కుంటూ వస్తుంది. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా ఆసియాకప్ కొట్టబోతున్నాం.''అంటూ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 29 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేనప్పటికి బ్యాటింగ్‌లో రాణించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా
Virat Kohli: హాంకాంగ్‌తో మ్యాచ్.. జిమ్‌లో కష్టపడుతున్న కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment