Bigg Boss Telugu 5: Big Fight Among Uma Devi, Priyanka Singh, Anee Master - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన ఉమాదేవి, ఆమె స్పీడుకు బ్రేకేసిన పింకీ

Published Mon, Sep 13 2021 6:50 PM | Last Updated on Tue, Sep 14 2021 1:46 PM

Bigg Boss Telugu 5: Big Fight Among Uma Devi, Priyanka Singh, Anee Master - Sakshi

Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో రెండో వారం నామినేషన్‌ల పర్వం మొదలు కానుంది. ఎలిమినేషన్‌కు దారులు వేసే నామినేషన్‌ అంటే ఎవరికి మాత్రం ఇష్టం? అందుకే తమను నామినేట్‌ చేసిన వారి మీదా, నామినేట్‌ చేయాలనుకునేవారి మీదా విరుచుకుపడుతున్నారు హౌస్‌మేట్స్‌. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. ఇందులో మానస్‌.. లోబోను నామినేట్‌ చేశాడు.

దీన్ని సహించలేని లోబో.. నామినేట్‌ చేయడానికి సరైన కారణాలు చెప్పాలని హితవు పలకాడు. నువ్వు హీరో అనుకుంటున్నావు, వినడానికి కూడా రెడీగా లేవని మానస్‌ మీద మండిపడ్డాడు. తర్వాత కాజల్‌ వంతు రాగా.. గ్రూప్స్‌లో చాలామంది ఫేక్‌గా ఆడుతున్నారని అభిప్రాయపడింది. అనంతరం విశ్వను నామినేట్‌ చేసింది. నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు యాంకర్‌ రవి.

ఇక నటి ప్రియ.. సన్నీ, నటరాజ్‌ మాస్టర్‌లను నామినేట్‌ చేసింది. తర్వాత ఉమాదేవి వంతురాగా.. 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి' అని సవాలు విసిరింది. దీంతో చిర్రెత్తిన ప్రియాంక సింగ్‌.. పోవే ఉమా పో.. అంటూ మరోసారి నోరు జారింది. ప్రోమో చూస్తుంటే యానీ మాస్టర్‌, పింకీ, ఉమాదేవి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. మరి వీరి మధ్య అగ్గి రాజుకున్న గొడవ చల్లారిందా? ఈ వారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement