
తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ 7 వరకు కొనసాగిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం లేని పేరు. అయితే బిగ్‌బాస్ ఎలిమినేషన్ తర్వాత ప్రియాంకకు భారీగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్‌ను ప్రియాంక సింగ్ కలిసింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ప్రియాంక. ఈ పోస్ట్‌కు 'ఒక సర్ప్రైజింగ్ వార్త రాబోతోంది. మీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రియాంక. ఇది చూస్తుంటే కోన వెంకట్‌తో ప్రియాంక సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మరీ అది ఏ సినిమా గురించో, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌గా మారింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక టాప్ 7 వరకు కొనసాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందం, ఆట తీరుతో అభిమానులను మూటగట్టుకున్న ప్రియాంక తర్వాత మానస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంపై ట్రోలింగ్ బారిన కూడా పడింది. ఏదైమైనా బిగ్‌బాస్ అనంతరం ప్రియాంకకు ఆఫర్లు రావడం ఆమె కెరీర్‌కు మంచి శుభపరిణామం.
Comments
Please login to add a commentAdd a comment