
ట్రాన్స్‌జెండర్ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునేవారే గుర్తొస్తారు. కానీ అయినవాళ్లందరికీ దూరమై, ఎన్నో కష్టాలు పడే చాలామంది..
Bigg Boss Telugu 5, Tamanna Simhadri About Priyanka Singh: తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమీ పేరు. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న ఆమె నటుడు రవికృష్ణతో గొడవలు పెట్టుకుని బాగా ఫేమస్ అయింది. కానీ తన విచిత్ర ప్రవర్తన వల్ల రెండు, మూడు వారాలకే హౌస్‌లో నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షో పేరెత్తని ఈమె తాజాగా ఒకరికి తన అండ అవసరమంటూ ముందుకొచ్చింది. బిగ్‌బాస్ షోలో ప్రియాంక సింగ్‌కు మద్దతు తెలుపుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది.
'చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసిన ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతున్నాను. ట్రాన్స్‌జెండర్ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునేవారే గుర్తొస్తారు. కానీ అయినవాళ్లందరికీ దూరమై, ఎన్నో కష్టాలు పడే చాలామంది గౌరవంగా బతకాలని ముందుకు వస్తున్నారు. వాళ్లలో ప్రియాంక సింగ్ ఒకరు. ఆమె బిగ్‌బాస్‌కు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది.
హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోని బిగ్‌బాస్ షోలలో ట్రాన్స్‌జెండర్లను తీసుకున్నారు. కానీ అందరూ రెండు మూడు వారాల కంటే ఎక్కువ హౌస్‌లో ఉండలేకపోయారు. అయితే ప్రియాంక మాత్రం 10 వారాల పైనే ఉంది. ఆమె ఫినాలేలో అడుగుపెట్టి గెలిస్తే అది వేరే లెవల్‌లో ఉంటుంది. నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను. మీరూ ఆమెకు సపోర్ట్ చేస్తే తను విజేతగా అవతరించే అవకాశం ఉంది. ఒక ట్రాన్స్‌వుమెన్ విన్నర్ అయితే అది ఇండియాలోనే రికార్డు అవుతుంది. అందరూ ప్రియాంక సింగ్‌కు ఓటేయండి' అని కోరింది తమన్నా.