
Priyanka Singh Vs Uma Devi: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో మొదటి వారంలోనే ఓ రేంజ్‌లో గొడవలకు దిగుతున్నారు కంటెస్టెంట్లు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వీళ్ల బిహేవియర్ చూస్తుంటే కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా ఉంది. మొత్తానికి వీళ్ల లొల్లితో బిగ్‌బాస్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. నేటి ఎపిసోడ్‌లో కూడా ఈ గిల్లికజ్జాలు పెద్ద స్థాయిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో దొరికిందే చాన్స్ అనుకున్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా తమ మనసులోని ఉక్రోషాన్ని బయటకు కక్కారు. ఈ క్రమంలో సరయూ.. 'ఏ పనులూ చేయకుండా టాస్క్‌లో కూర్చుంటున్నారు, అంటే టాయ్‌లెట్‌కు వెళ్లడం ఒక్కటే మీరు చేసే పనా?' అని నిలదీసింది. ఉమాదేవి చాలా పెద్దగా మాట్లాడుతుందని శ్వేతవర్మ తన అభిప్రాయం చెప్పింది.
అనంతరం ప్రియాంక సింగ్ ఉమాదేవి గురించి చెప్తున్న సమయంలో ఆమె మధ్యలో కలగజేసుకుని పర్సనల్ విషయాలు తీయొద్దని హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియాంక తన ముఖం మీదే షటప్ అనేసింది. తనను అంత మాటన్నాక ఉమాదేవి ఊరుకుంటుందా? అస్సలు వదిలిపెట్టదు. అంటే ఈరోజు కూడా హౌస్‌లో బీభత్సమైన గొడవ జరగనునట్లు తెలుస్తోంది. ఇక వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీకి ఎక్కువ ఓట్లు పడ్డట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అతడిని జైలులో ఖైదీగా మార్చారని కూడా ఓ వార్త లీకైంది. ఒకవేళ ఇదే నిజమనుకుంటే.. వరస్ట్ పర్ఫామర్ జెస్సీ అయితే మరి బెస్ట్ పర్ఫామర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment