![Bigg Boss 5 Telugu: Priyanka Singh Remuneration For 13 Weeks - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/5/pinky-1.gif.webp?itok=kGJjTNS-)
Bigg Boss 5 Telugu 13th Week Elimination | Priyanka Singh Remuneration: ప్రియాంక సింగ్.. అదిగో వెళ్లిపోతుంది, ఇదిగో వెళ్లిపోతుంది అంటూ చాలాసార్లు ఆమె ఎలిమినేషన్ గురించి వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం మొక్కవోని దీక్షతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి జర్నీదాకా చేరుకుంది. కానీ టాప్ 5లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. 13వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈసారైనా ఒక ట్రాన్స్‌జెండర్ ఫినాలేలో అడుగుపెడుతుందేమోనన్న ఆశలను అడియాశలు చేసింది. అయితే పింకీకి బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా మానస్ దూరమవుతున్నాడన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.
అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. తాజాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక ఈ షో ద్వారా ఎంత సంపాదించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు టాక్! అంటే ఈ లెక్కన పింకీ 13 వారాలకు గానూ మొత్తంగా దాదాపు పాతిక లక్షల రూపాయలు వెనకేసిందన్నమాట! అయితే షోలో ఆమె పర్ఫామెన్స్‌ను బట్టి ఈ పారితోషికం కాస్త అటూఇటుగా ఉండే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment