వరుస టాస్క్‌లతో హీటెక్కిపోయిన హౌస్‌ను చల్లార్చేందుకు హౌస్‌మేట్స్‌కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి ఆడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నల్లచీర కట్టుకుని అందంతో ఉడికిస్తున్న ప్రియాంక సింగ్‌ను చూసి శ్రీరామ్ వాలుకనులదానా.. అని పాట అందుకున్నాడు.
తర్వాత ప్రియాంక సింగ్, లోబో కలిసి ఖుషీ స్కిట్ వేశారు. ఏదో ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నట్లుగా తెగ యాక్టింగ్ చేసిన లోబో మధ్యలో ఓరగా పింకీ నడుము వంక చూశాడు. ఆ చూపులను ఇట్టే గుర్తుపట్టిన పింకీ .. నీ చూపు సరిగా లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. ఇదిలా వుంటే నటరాజ్ మాస్టర్ మరోసారి యాంకర్ రవి మీద పడ్డాడు. టాస్క్ చేస్తున్న సమయంలో అతడిని చూస్తుంటే నత్త గుర్తొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇక పదేపదే తన పేరు తీసి వాగుతున్నాడని రవి అసహనానికి లోనయ్యాడు. తన గురించి ఆయనకెందుకో అని చిరాకు ప్రదర్శించాడు. తర్వాత బిగ్‌బాస్ ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ప్రకటించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో శ్వేత.. కాజల్‌ను వరస్ట్ అని పేర్కొంది. మరి మెజారిటీ కంటెస్టెంట్లు ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment