
Bigg Boss Telugu 5 Promo: తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే! అది సఫలమైనా, విఫలమైనా! తొలి ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసులో ఏదో తెలీని అనుభూతికి లోనవుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సింగర్ శ్రీరామచంద్ర తన ఫస్ట్ లవ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు ఇదివరకే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారన్నాడు. దీప్తి సునయన కంటే ముందే తను ఒకరిని ప్రేమించానని ఓ సీక్రెట్ బయటపెట్టాడు షణ్ముఖ్. ఇక జెస్సీ తను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె సింగిల్ అయితే, తాను రెడీ టు మింగిల్ అని సిగ్నల్ ఇచ్చేశాడు.
తనలో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయని తెలిసింది తన ఫస్ట్ లవ్ వల్లేనంది శ్వేతవర్మ. ఇప్పుడు నేను మ్యారీడా? సెపరేటా? విడాకులయ్యాయా? అనేది నాకే తెలీదంటూ కుమిలిపోయింది ప్రియ. తను ప్రేమించినవాడు చనిపోయాడంటూ తన విషాద గాథ చెప్తూ కంటతడి పెట్టుకుంది సిరి. ఇక ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ.. నేను ప్రేమించిన అబ్బాయి బండి వెళ్లిపోతుంటే ఆ బండి వెనక పరిగెత్తుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. మరి కంటెస్టెంట్ల ఫస్ట్ లవ్ స్టోరీల గురించి తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment