
పింకీ కోసం రవిని బలి చేశారంటూ చాలామంది బిగ్‌బాస్ షోతో పాటు ఆమెను ట్రోల్ చేశారు. అయితే ఈసారి మాత్రం పింకీ తప్పించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది...
Bigg Boss Telugu 5 13th Week Elimination: Priyanka Singh Eliminated From BB5 House: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ కథ కంచికి, కంటెస్టెంట్లు ఫినాలేకు చేరబోతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండటంతో అందులో ఇద్దరిని పంపించేసి మిగతా ఐదుగురు ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. ఇక ఈ వారం షణ్ను, సన్నీ మినహా సిరి, కాజల్, మానస్, శ్రీరామచంద్ర, ప్రియాంక నామినేషన్‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయి తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేయనున్నారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట! నిజానికి ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా మేల్ కంటెస్టెంట్లకు బాగా టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కొంత వెనకబడి ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టాస్కుల్లో వారితో సమానంగా ఆడలేక మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. దీంతో ఈ వారం హౌస్‌లో నుంచి ఫీమేల్ కంటెస్టెంట్ బయటకు వచ్చేయనుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవడం తథ్యం అని భావిస్తున్నారు.
నిజానికి గతవారమే ఆమె ఎలిమినేట్ అవుతుందనుకున్నారు కానీ షోలో సీన్ రివర్స్ అయింది. యాంకర్ రవిపై ఎలిమినేషన్ వేటు పడింది. దీంతో పింకీ కోసం రవిని బలి చేశారంటూ చాలామంది బిగ్‌బాస్ షోతో పాటు ఆమెను ట్రోల్ చేశారు. అయితే ఈసారి మాత్రం పింకీ తప్పించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. 13వ వారంలో ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!