Bigg Boss Telugu 5, Episode 62, New Captain: బిగ్‌బాస్ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో చాలా వింతలు జరిగాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ముద్దు పెట్టాడు జెస్సీ. ప్రియాంకను సిస్టర్ అని సంభోదించాడు మానస్. మరోవైపు హౌస్‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. త్రిమూర్తులైన షణ్ముఖ్, జెస్సీ, సిరిల మధ్య విభేదాలు వచ్చాయి. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయంటే..
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా సూపర్ విలన్స్ Vs సూపర్ హీరోస్ మధ్య హోరా హోరి పోరు జరిగింది. ఇప్పటి వరకు జట్టుగా ఆటలు ఆడించిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఒక్కొక్కరిని బరిలోకి దింపాడు. ఇరు జట్ల నుంచి ఒక్కొక్కరు ముందుకువచ్చి తమతమ ప్లాట్‌ఫామ్‌పై నిలబడి కర్రతో ఒకరినొకరు తోసుకోవాలి. మొదట ఎవరు పడిపోతే వారు ఓడినట్లు. ఇలా ఏ టీమ్ నుంచి ఎక్కువ సభ్యులు పడిపోతారు.. ఆ టీమ్ ఓడిపోతుంది. ఈ టాస్క్‌లో భాగంగా హీరోస్ టీమ్ నుంచి వచ్చిన మానస్.. విలన్స్ టీమ్ సభ్యులందరిని కిందకు నెట్టేశాడు. దీంతో ఈ టాస్క్‌లో హీరోస్ టీమ్ విజయం సాధించింది. అనంతరం కీ లాక్‌ని విలన్స్ టీమ్ దక్కించుకుంది. ఓవరాల్‌గా విలన్స్ టీమ్ ఎక్కువ పాయింట్స్ పొంది కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కి ఎంపికైంది.
ప్రియాంకకు జెస్సీ ముద్దు.. షాకైన ఇంటి సభ్యులు
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కు ఎంపికైన విలన్స్ టీమ్ సభ్యులు రవి, యానీ, సన్నీ,జెస్సీ, విశ్వ, సిరిలకు మిగతా సభ్యులు అభినందనలు తెలిపారు. సోఫాపై కూర్చున్న జెస్సీకి ప్రియాంక వెనుక నుంచి హగ్ ఇస్తుండగా.. జెస్సీ ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఒక్కసారిగా తనని ముద్దాడే సరికి షాక్ అయ్యింది ప్రియాంక. ఆమెను చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.. షణ్ముఖ్‌తో మనోడు పెట్టేశాడు.. అంటూ సెటైర్ వేశాడు. ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని సన్నీ అడగ్గా.. ‘ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను అంతే.. ఫటుక్కున తిరిగి ముద్దు పెట్టేశాడు’అంటూ ప్రియాంక ముసిముసి నవ్వులు నవ్వింది.
సిరి-షణ్ముఖ్‌ల మధ్య మళ్లీ లోదుస్తుల లొల్లి
గురువారం నాటి ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్ మధ్య లోదుస్తులపై గొడవ జరిగిన విషయం తెలిసిందే. టాస్క్‌లో భాగంగా సిరి ఇంట్లోని దుస్తులన్నింటిని ఎత్తిపారేసింది.దీంతో ఇద్దరి మధ్య గొడవజరిగింది. అప్పటి నుంచి దూరం దూరంగా ఉంటున్న సిరి.. మళ్లీ షణ్ముఖ్ దగ్గరకు వచ్చి ఆ విషయంపై చర్చించింది. అరేయ్ మీరు సూపర్ విలన్స్‌హా..పిచ్చోళ్లా..? ఎవరైనా దుస్తులు ఎగరేస్తారా?అని సిరిపై పంచ్ వేశాడు షణ్ముఖ్. పక్కనే ఉన్న కాజల్ గట్టిగా నవ్వింది. అయితే సిరి మాత్రం తనను తాను సమర్థించుకుంది. . అది విలనిజం.. అలాగే ఉంటుంది.. నేను దుస్తులు ఎగరేశా.. అందులో లోదుస్తులు ఉన్నాయని నాకేం తెలుసు? అని చెప్పింది సిరి. కెప్టెన్‌గా ఇల్లు సరిగా పెట్టలేదని నాగార్జున గారు నాకు క్లాస్ పీకుతారు.. అందుకే అలా కోపడ్డాను అని షణ్ముఖ్ అనగా.. ఇది ఓవర్ థింకింగ్ అని సిరి చెప్పుకొచ్చింది.
మానస్ సిరియస్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక
మానస్ వద్దొద్దు అంటున్నా..అతని వెనకాలే తిరుగుతోంది ప్రియాంక. సిస్టర్ అని సంభోదించినా సరే.. తానంటే ఇష్టమని చెబుతోంది. దీంతో ఆమెను కాస్త దూరంపెట్టే ప్రయత్నం చేశాడు మానస్. అయినప్పటికీ.. అతని దగ్గరికి వచ్చి ప్రేమ గీతాలు మొదలెట్టింది ప్రియాంక. దీంతో చిరాకు పడ్డ మానస్.. ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నావా అని మొఖంమీదే అడిగేశాడు. దీంతో చాలా హర్ట్ అయిన ప్రియాంక.. ‘నువ్వు అలా అంటుంటే నేను చాలా ఫీలవుతున్నా’అని చెప్పగా.. ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్.. తినాలా? వెళ్లిపోవాలా ?అని మానస్ సీరియస్ అయ్యాడు.
దీంతో అక్కడ నుంచి వెళ్లి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ప్రియాంక.. సిరితో తన బాధను పంచుకుంది. అయితే సిరి మాత్రం ప్రియాంకను మరింత రెచ్చగొట్టింది. .. మీ మ్యాటర్ ఎంత వరకూ వచ్చింది.. నాకు నిన్ననే తెలిసింది.. మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారంట కదా.. అంటూ లవ్ సింబర్ చూపించింది. సైగ చేయకే అర్థం అయిపోతుంది అని ప్రియాంక తెగ సిగ్గుపడిపోగా.. అతనికి కూడా ఇష్టమేనంట కదా అని సిరి అన్నది. దీంతో ప్రియాంక.. నేనంటే ఇష్టం అని తెలుసు.. కానీ ఓపెన్ కాడు.. తనకి తెలుసు నేనేంటో అంటూ కనీళ్లు పెట్టుకుంది. సిరి ఆమెను ఓదారుస్తూ.. ‘ఏడ్వకు పింకీ.. మనల్ని అంటున్నారు అంటే.. మనపై చనువు ఉంటేనే అంటారు’అంటూ తన ఆశలను రెట్టింపు చేసింది.
చిక్కకుండా.. దొరక్కుండా కెప్టెన్ అయిన యానీ
కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘చిక్కకు దొరకకు’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా.. కెప్టెనీ పోటీదారులైన రవి, సిరి, జెస్సీ, సన్ని, విశ్వ, యానీ మాస్టర్ వెల్‌క్రో జాకెట్ ధరించి ఉండాలి. మిగిలన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలి. విసిరిన బాల్స్ నుంచి తప్పించుకొని అందరికంటే తక్కువ బాల్స్ అంటుకున్న కంటెస్టెంట్ కెప్టెన్ అవుతారు. అలా ఈ టాస్క్‌లో చివరి వరకు ఆడి యాని మాస్టర్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా నిలిచింది. హౌస్ లోకి వచ్చిన దగ్గరినుంచి యాని మాస్టర్ కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వలేదు. తాజాగా కెప్టెన్ అవ్వడంతో తన చిరకాల కల నెరవేరింది అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment