ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్‌ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటారు.
వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్‌లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్‌లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు.
ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్‌కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్‌ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్‌కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్‌కు అర్థమైంది.
నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment