తండ్రి బర్త్‌డే, బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వబోతోన్న మెగా డాటర్‌ నిహారిక! | Niharika Konidela Give Big Announcement On October 29th Over Zee5 OCFS | Sakshi
Sakshi News home page

Niharika Konidela: నాగబాబు బర్త్‌డే, అనౌన్స్‌మెంట్‌ ఇవ్వబోతోన్న మెగా డాటర్‌ నిహారిక!

Published Thu, Oct 28 2021 8:49 PM | Last Updated on Thu, Oct 28 2021 9:42 PM

Niharika Konidela Give Big Announcement On October 29th Over Zee5 OCFS - Sakshi

మెగా డాటర్‌ నిహారిక రేపు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. రేపు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందని తాజాగా జీ5 సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.  ఈ మేరకు జీ5 ట్వీట్‌ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది.

చదవండి: సమంత పోస్ట్‌పై వెంకటేశ్‌ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్‌

జీ5 చేసిన ఈ ప్రకటనను నిహారిక రీట్వీట్ చేస్తూ.. తాను కూడా ఫుల్‌ ఎగ్జైటింగ్‌ ఉన్నానని పేర్కొంది. ‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏమిటో రేపు వెల్లడిస్తాను’ అని చెప్పింది.  తెలిపారు. కాగా గత ఏడాది చైతన్యతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వివాహానంతరం ఆమె తొలిసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.

చదవండి: అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement