Nagababu Birthday
-
తండ్రి బర్త్‌డే, బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతోన్న మెగా డాటర్ నిహారిక!
మెగా డాటర్ నిహారిక రేపు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. రేపు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రానుందని తాజాగా జీ5 సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు జీ5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది. చదవండి: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ జీ5 చేసిన ఈ ప్రకటనను నిహారిక రీట్వీట్ చేస్తూ.. తాను కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నానని పేర్కొంది. ‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏమిటో రేపు వెల్లడిస్తాను’ అని చెప్పింది. తెలిపారు. కాగా గత ఏడాది చైతన్యతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వివాహానంతరం ఆమె తొలిసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. చదవండి: అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే.. "Whats #OCFS? Guess Guess.@zee5telugu I am also super excited about this too. Revealing #OCFS tomorrow on a special day as it is Nanna’s birthday". All the abbreviation will be shared on stories all day. https://t.co/2R4DamY6N2 — Niharika Konidela (@IamNiharikaK) October 28, 2021 -
నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి
మెగా బ్రదర్, లాఫింగ్ స్టార్ నాగబాబు పుట్టినరోజు వేడుకలను ‘మెగా’ ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను వారు ట్విటర్లో పంచుకున్నారు. మంగళవారం( అక్టోబర్ 29) నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతోపాటు అటు సినీ ప్రముఖులు ఇటు అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్‌తో ట్విటర్ మోత మెగింది. నాగాబాబు గారాలపట్టి నిహారిక తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తండ్రి నుదుటిపై ముద్దు పెడుతూ ‘ఐ లవ్ యూ నానా.. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నువ్వే.. గత జన్మలో ఖచ్చితంగా నా కొడుకుగా పుట్టుంటారు.’ అంటూ నిహారిక తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. View this post on Instagram I love you so much Nanna! ❤️ I need a bigger heart to fit in all the love I have for you! You make me laugh like no other. And you are one in a gazillion! 😘😘😘 . You were definitely my son in the last birth😂😘 . . Thanks a lot for this picture @pranithbramandapally 🤗 A post shared by Niharika Konidela (@niharikakonidela) on Oct 29, 2019 at 2:46am PDT అలాగే కొడుకు వరుణ్ తేజ్ సైతం తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘నీ మొహం మీద చిరునవ్వు కోసం మేము ఏదైనా చేస్తాం. ఇంతటి అందమైన జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలు.. నాన్నా లవ్ యూ ద మోస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ ట్విటర్ వేదికగా మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘నాగాబాబు మామ హ్యాపీ బర్త్‌డే.. లవ్ యూ సో మచ్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు తనకుంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Happy birthday Nana! Will do anything to put a smile on your face.. Thanks for this wonderful life you’ve given me.. Love you the most!❤️❤️❤️ pic.twitter.com/HipE4AlP3X — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2019 -
కల్యాణ్‌కి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదు!
నాగబాబు బర్త్‌డే సినిమాలూ సీరియల్స్‌తో నాగబాబు ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు తన కుమారుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏదైనా బోల్డ్‌గా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. నేడు నాగబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కెరీర్, రాజకీయాలు, పవన్‌కల్యాణ్, ఇతర విషయాల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఫోన్లో ముచ్చటించారు. ఈ పుట్టినరోజుకు ప్రత్యేకత ఏమైనా ఉందా? ఏమీ లేదు. నాకు చిన్నప్పట్నుంచీ పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. గుడికి వెళ్లే అలవాటు కూడా లేదా? ప్రత్యేకంగా పుట్టినరోజు నాడు మాత్రమే కాదు.. నాకు ప్రతిరోజూ దేవుడు గుర్తుంటాడు. వెళ్లాలనిపించినప్పుడల్లా గుడికి వెళతాను. మొన్నీ మధ్యే శబరిమల వెళ్లొచ్చాను. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తారా? అంతకుముందు రెగ్యులర్‌గా శబరిమల వెళ్లేవాణ్ణి. ఇటీవల కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ మధ్యనే వెళ్లొచ్చాను. ఓకే.. సినిమాల విషయానికొద్దాం. బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ‘లెజెండ్’లో కీలక పాత్ర చేస్తున్నారని వినికిడి. నిజమా? ఈ చిత్రంలో నేను నటిస్తున్నాననే వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఆ యూనిట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. సినిమాలతో పాటు టీవీ షోస్, సీరియల్స్‌తో కూడా బిజీగా ఉన్నారనిపిస్తోంది? అవును. ముఖ్యంగా ‘జబర్దస్త్’ షో అయితే నాకు పెయిడ్ హాలిడేలాంటిది. నెలలో రెండురోజులు ఆ షోకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఉదయం పదినుంచి రాత్రి మూడు గంటల వరకు నిరాటంకంగా చేస్తాం. నిద్రను త్యాగం చేసినా మంచి షో అయినందువల్ల చాలా సంతృప్తిగా ఉంది. అలాగే టీవీ సీరియల్స్ చేయడం కూడా మంచి అనుభూతినిస్తోంది. త్వరలో ఓ కొత్త సీరియల్లో నటించబోతున్నా. మీ అంజనా ప్రొడక్షన్స్ సంస్థలో మళ్లీ సినిమా నిర్మాణం ఎప్పుడు? ఇప్పట్లో సినిమా నిర్మించే ఉద్దేశం లేదు. సినిమాలు, టీవీ షోస్, సీరియల్స్‌లో యాక్ట్ చేయడం.. ఇదే నా ప్రస్తుత కర్తవ్యం. ఈ మధ్య పవన్‌కల్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి బాగా చర్చ జరిగింది. మీరిద్దరూ కలిసి ఓ పార్టీలో చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి... మా ఇద్దరికీ ఏ పార్టీతో సంబంధం లేదు. పవన్‌కల్యాణ్ ఇప్పుడు హీరోగా ‘టాప్ స్లాట్’లో ఉన్నాడు. తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదు. దక్షిణాదిన రజనీకాంత్‌గారి తర్వాత ఆ స్థాయి పేరున్న నటుడు పవన్‌కల్యాణ్. రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా కెరీర్‌ని నాశనం చేసుకోడు. ఇక నా సంగతంటారా.. చిరంజీవిగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేనూ పాల్గొనాలనుకుంటున్నా. అంతకు మించి నాకు ప్రత్యేకంగా పొలిటికల్ అజెండా లేదు. అసలు రాజకీయాలపరంగా ఎస్టాబ్లిష్ అవాలన్న ఆలోచనే లేదు. మీ అబ్బాయి వరుణ్‌తేజ్ హీరోగా ఎప్పుడు రంగప్రవేశం చేయబోతున్నారు? ఈ డిసెంబర్లో పూర్తి వివరాలు ప్రకటిస్తాను. యాక్టింగ్‌లో వరుణ్ శిక్షణ ఏమైనా తీసుకుంటున్నారా? వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంకా బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఈ తరం హీరోకి కావాల్సిన అర్హతలన్నీ పుష్కలంగా పుణికిపుచ్చుకునే పని మీదే ఉన్నాడు. మీ కెరీర్‌తో పాటు ఇక వరుణ్ కెరీర్‌ని కూడా ప్లాన్ చేయాలన్నమాట? అవును. వరుణ్ కెరీర్‌కి ఉపయోగపడే మంచి సినిమాలు ఎంపిక చేయాలనుకుంటున్నాను. అలాగే, తను మంచి నటుడు అని నిరూపించుకోదగ్గ పాత్రలు చేయించాలని ఉంది.