
హైదరాబాద్: ‘‘నా బంగారు తల్లి నిహారిక, మా డాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో వర్ణించేందుకు మాటలు సరిపోవు!’’ అంటూ సినీ హీరో వరుణ్ తేజ్ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అదే విధంగా తన ముద్దుల చెల్లి నిహారిక పెళ్లి సందర్భంగా శుభాశీసులు అందజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం- జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.
(నిహారిక- చైతన్య వివాహం: మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి)
మెగా కుటుంబ హీరోలంతా ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైన నాటి నుంచే నిస్‌చై పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
(మెగా కుటుంబం సందడి: నిహారిక-చైతన్యల సంగీత్ ఫొటోలు)
ఇక ఇప్పుడు వరుణ్ తేజ్, చెర్రీ సతీమణి ఉపాసన, బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా నిహారిక- చైతన్య దంపతులకు విషెష్ చెబుతూ మరిన్ని ఫొటోలు షేర్ చేశారు. తమ ముద్దుల చిన్నారి అర్హ ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతుందంటూ అల్లు స్నేహారెడ్డి పంచుకున్న ఫొటో బన్ని అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇక ఉపాసన మిస్టర్ సితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. అద్భుతమైన ఆతిథ్యం అందించినందుకు నాగబాబు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.






Comments
Please login to add a commentAdd a comment