Naga Babu Shocking Reaction On Varun Tej Marriage With Sai Pallavi, Nagababu Used Brahmananda Pic - Sakshi
Sakshi News home page

సాయి పల్లవితో వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. నాగబాబు ఏమన్నారంటే..

Published Tue, Apr 6 2021 9:05 AM | Last Updated on Tue, Apr 6 2021 1:28 PM

Nagababu Funny Reaction On Varun Tej marriage With Sai Pallavi - Sakshi

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి తర్వాత అందరి చూపులు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌పై పడ్డాయి. వరుణ్‌ పెళ్లి గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెల్లి పెళ్లి అయింది కాబట్టి అతి త్వరలోనే వరుణ్‌ బాబు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. నాగబాబు కూడా పలుమార్లు వరుణ్‌ పెళ్లి గురించి స్పందించారు. వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అమ్మాయి ఉంటే చూడమని కూడా మెగా అభిమానులకు సూచించాడు.

అంతేకాదు వరుణ్‌కు పెళ్లి చెద్దామని తమకు కూడా ఉందని, కానీ వాడే ఇప్పుడు వద్దంటున్నాడని గతంలో ఓ ఇంటర్వూ‍్యలో కూడా చెప్పాడు. దీంతో వరుణ్ ఒక హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడని, అందుకే ఇప్పుడు పెళ్లి వద్దంటున్నాడని వార్తలు వినిపించాయి. వీటిని మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా వరుణ్‌ పెళ్లి గురించి ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు నాగబాబు ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇటీవల నాగబాబు ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు సైతం అవాక్కయ్యారు. ఏం చేయాలో పాలుపోని నాగబాబు జాతిరత్నాలు సినిమాలోని  క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు.

ఆ కోర్ట్ సీన్‌లో జడ్జ్‌గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఇదే వీడియో నాగబాబు పోస్ట్ చేశారు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడిమాలో వైరల్‌ అయింది. కాగా, వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి కలిసి ‘ఫిదా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement