
మరో నాలుగు రోజుల్లో కొణిదెల వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్సెస్ నిహారిక జొన్నలగడ్డవారి కోడలు కానుంది. పెళ్లికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తికాగా..డిసెంబర్ 9న జరగబోయే పెళ్లికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కి తరలి వెళ్లనున్నారు మెగా ఫ్యామిలి. ఈ సందర్భంగా తన సంతోషకరమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నిహారిక. ప్రీవెడ్డింగ్ షూట్‌లో తనను రెడీ చేస్తున్న తన స్నేహితురాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఇంతకంటే గొప్పగా నన్ను రెడీ చేసేదెవరంటూ పోస్ట్ చేసింది. (చదవండి: మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!)
ఆగస్టు 13న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను జ్ఞాపకాలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటితోపాటు తన కాళ్లకు హీల్స్ వేస్తున్న ఇద్దరి స్నేహితుల పిక్స్‌ని కూడా నిహారిక షేర్ చేసింది. ‘వీళ్లు నాకు హీల్స్ వేయడంలో సహాయం చేస్తున్నారు, వీరు కాకుండా నన్ను పెళ్లి కూతుర్ని చేసేందుకు పర్‌ఫెక్ట్ పర్సన్స్ ఉన్నారని నేను అనుకోవడం లేదు లవ్ యూ గర్ల్స్’ అంటూ సోషల్ మీడియా వేదికగా వారి మీద తనకున్న ప్రేమను తెలియజేసింది. నాగబాబు కూతురు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ఎం. ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన జరగనుంది. రాజస్తాన్‌లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు రాజస్తాన్ తరలి వెళ్లనున్నాయి. ఇటీవలే తమ వెడ్డింగ్ కార్టును ఫైనలైజ్ చేశారు ఈ జంట.
Comments
Please login to add a commentAdd a comment