
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు చరణ్. కనిపించేది కొద్దిసేపే అయినా చరణ్ పాత్ర చాలా హైలెట్‌గా ఉంటుదని టాక్. అయితే ఈ సినిమాలో చెర్రీ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ముందుగా చెర్రీ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వానీ అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో రష్మికను సంప్రదించినట్టు సమాచారం.
(చదవండి : ఆచార్య: భారీ సెట్.. అన్ని కోట్ల ఖర్చా!)
రష్మిక కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, జనవరి మూడో వారంలో ‘ఆచార్య’ సెట్లోకి అడుగుపెడతారట రామ్‌చరణ్. అప్పుడే రష్మిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుందట. ఒకే షెడ్యూల్‌లో వీరిద్దరికి సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేస్తారట. కాగా, ఇప్పటికే రష్మిక ‘పుష్స’లో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. ఇప్పుడు మరో మెగా హీరో సరజన నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడు ఫుల్ ఖుషీ అవుతుందట. వచ్చే ఏడాది వేసవిలో ‘ఆచార్య’ను థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment