- కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం. తన మానాన తాను ట్విట్టర్లో పిచ్చి ట్వీట్స్ చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటావు ఉంటే ఉన్నఫళాన ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటాం సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి మొన్నామధ్య ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయన్ను ఎంపిక చేసి రాజ్యసభకు ఢిల్లీ పంపుతారని వార్తలు వచ్చాయి కానీ అది కుదరకపోవడంతో ఎకాఎకిన ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికీ త్వరలో కేబినెట్లో స్థానం కల్పిస్తాం అని ప్రకటన చేయలేదు. దీని మీద అప్పట్లో జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియావాళ్లు సైతం బాగానే ట్రోల్ చేసారు. కానీ ఇంతవరకు ఆ విషయమై ఏమీ తేలలేదు..
ఇదిలా ఉండగా మంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేయాలన్నదానిమీద నాగబాబు ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేసేసి. కొత్త బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నుంచి .. రాజ్ భవన్నుంచి కనీసం పిలుపు రాలేదు. వాస్తవానికి రాష్ట్ర కేబినెట్లో ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికె పలువురు మంత్రులు రెండేసి పదవులు చేపట్టి బాధ్యతలు మోస్తున్నారు. వాటిలో ఒకటి తీసేసి ఈయనకు ఇస్తారని.. అది కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇస్తారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఆ సౌండ్ కూడా ఇప్పుడేం లేదు.. అంతా సైలెంట్ అయిపొయింది.
ఆరోజుకు కూల్ చేయడమే చంద్రబాబు లక్ష్యమా ?
వాస్తవానికి రాజ్యసభ స్థానం కోసం పట్టుబట్టిన నాగబాబును కూల్ చేయాడానికి అప్పటికపుడు ఆ మంత్రి పదవి పేరిట ఒక ప్రకటన ఇచ్చారు తప్ప ఇప్పుడప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఏమి పదవి అడగాలి.. ఏది తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్.. నాగబాబులమధ్య చర్చలు కూడా నడిచాయని ఏ శాఖ తీసుకోవాలన్నదానిమీద వారు ఒక అవగాహనకు వచ్చారని కూడా అంటున్నారు కానీ చంద్రబాబు దగ్గర ఇవన్నీ నడుస్తాయా..? అయన ఇచ్చింది తీసుకోవడం తప్ప వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలూ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గమ్మున కేబినెట్లోకి దూకేసి హడావుడి చేద్దాం అనుకున్న నాగబాబు స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్ళా ఏదైనా అవసరం పడినపుడు. పవన్ బ్రదర్స్ ను కూల్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చూద్దాం అందాక ఊరుకుందాం అని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment